ఈ పుట అచ్చుదిద్దబడ్డది
లున్ను అన్యోన్య సహాయముతో పనిచేసుకొంటవి. జర్మనుల పరిశ్రమాధిక్యతకు ఇదియే మూలరహస్యము.
పరిశ్రమలను అభివృద్ధి చేయుడము, నిర్బంధ కార్మిక విద్య నేర్పడములలో జర్మనుకు ఎక్కువ శ్రద్ధ ఉన్నా, వారు ప్రాచీన విషయ పరిశోధనమును కడకంటితో చూడరు. ఈ విషయములను అభివృద్ధి చేయడమునకు విశ్వవిద్యాలయాలవారు ఎక్కువ పాటుపడ తారు, ఈవిషయములు జిమ్నే సియములలోను విశ్వవిద్యాలయాలలోని వేదాంత” శాఖలలోను ఎక్కువగా ఉన్నది. యుద్ధానికి పూ ర్వమందు వలే ఇప్పుడున్ను ఈవిషయములమీద అభిమానము తగ్గ లేదు. జర్మనులకు బుద్ధిస్వాతం త్ర్యము మెండు. ఇప్పుడు జీవితము ఆర్థిక పద్ధతులు మీదనే నడుస్తూఉన్నా, జర్మనులకు ఆధ్యాత్మిక విష యములమీదనే ఎక్కువ ప్రీతి అని చెప్పవచ్చును.
(1) విశ్వవిద్యాలయాలలో మొదట చేరే టప్పుడు విద్యార్థికి తగిన సలహా లేక ఒక సంవత్సరము పృధాగా పోవడము (2) రాజ్యాంగ విషయములలో
203