పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తికి మరి ఒక ముఖ్య లక్షణము. ఒక్క అధ్యాపకు లే కాక ప్రతివాడున్ను తనవృత్తిలో విశేషజ్జుడుగాఉంటాడు. తనవృత్తిని దాటి,మరొకవిషయములో బడిపిల్లవానికంటే తక్కువగా ఉంటాడు. ఇప్పుడు జీవనము ఎక్కువపోటీతో సాగుతున్నది. ఇట్టి సమయములో విశేషజ్ఞత చాలా అవసర మే. కాని, ఈ పద్ధతి ప్రకారము మంచి నాయకులు తయారుకారు. ఇంగ్లాండులో మంచిలాభముగా పని చేసే కార్మిక సంస్థల యజమానులు తమవృత్తిలో విశేషజ్ఞులై ఉండరు.కౌని, వారికి మంచి విశాల మైన విద్య ఉంటుంది, ఎక్కువ ప్రపంచానుభవ ముంటుంది. జర్మనీలో ప్రతివాడున్ను పరిశోధ నము చేస్తాడు, ఇంగ్లాండులోను, ఫ్రాన్సులోను, మంచి తెలివి తేటలుగలవారే పరిశోధనము చే స్తారు. గొప్ప విషయములను కనుక్కొనేవారు సాధారణముగా జర్మను లై ఉండరు. కనుగొన్న విషయమును సూక్ష్మాంశములతో కూడా విస్తరింప చేయడములో జర్మనులకు పెట్టినది పేరు. జర్మ నీలో విశ్వవిద్యాలయములున్ను, పరిశ్రమ సంస్థ


202