పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యనవద్దకు నెమ్మదిగా పోయి “అయ్యా, ఆవిద్యా ర్థి చెల్లించవలసినది చెల్లించినాడా?"అని అడిగినాడు. " చెల్లించినాడు” అని అతడు జబాబిచ్చి నాడు. "అయి తే, ఆతని స్థానములో ఈ నా చేతి కర్రనుంచి ప్రయాణము సాగించండి.” అని విద్యార్ధి చెప్పినాడట, అందరున్న పక్కున నవ్వి బండిలో కదలినారట.

ఒక్క బడులలో నేకాక రాజ్యంగ విషయ ములన్నిటిలోను ఈరీతిగా అతిసూక్ష్మవిషయము లనుకూడా ముందుగా ఏర్పరుచుకొనడము జర్మము వారిలక్షణము. ఇంగ్లీషువారి కట్టిలక్షణములేదు. అకస్మాత్తుగా ఏర్పడిన పరిస్థితుల నెదుర్కొ నడ ములో వారికి ఎక్కువ ప్రజ్ఞ ఉన్నది.

జర్మనులు మిక్కిలిపాటుపడే స్వభావము యూరోపులోని అన్ని జాతుల వారి కంటె జర్మనులు ఎక్కువ పాటుపడ తారు. విశ్వ విద్యాలయాలలో ఎండకాలములో ఉదయం 6 - గంటలకున్ను, చలికాలములో 7 గంటల కున్ను పని ఆరంభించి, రాత్రి తొమ్మిదిగంటలవరకు పనిచే గలవారు.

198