ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పాఠమునకున్ను కౌగికముమీద అచ్చు వేసిన బో మ్మ లేకాకుండా, గట్టిబొమ్మలు కూడా కావ లెను. జర్మనీలో పిల్లలు ఈగట్టి బొమ్మలను తామే చేసు కొంటారు. కథాపాఠములను పిల్లలు గదులలో నాటకమాసుతారు, శాస్త్రవిషయాలకు, బడిగ దులలో మేజా బల్ల లుంటవి .వీటి మీద ఉపాధ్యా యులు ఆయా పనులను చేసి చూపడ మేకాకుండా, పిల్లల చేతకూడా చేయిస్తారు.
ఈకింద జర్మనీ లోని ఒక పాఠశాలావస్తు ప్రదర్శనశాల వర్ణింపబడినది. ప్రవేటుగానే దీనిని ఏర్పాటు చేసినారుగాని, దీనికి ప్రభుత్వము వారు కొంత గ్రాంటు ఇస్తారు. ప్రతిప్రదర్శన 'శాలలలోను మంచి గ్రంథాలయమున్ను , పఠనాల యమున్ను ఉండవలెను.ఈశాలలోని గ్రంథా లయములో 20,000 పుస్తకములున్నవి; ఇవన్నీ విద్యా పద్ధతులకు సంబంధించిన వే దీనికి 275 విద్యావిషయిక పత్రికలను తెప్పిస్తారు. విషయ ముల ప్రకారము వస్తు ప్రదర్శనశాల అనేక శాఖ లుగా ఏర్పడి ఉన్నది. శాలలోనికి పోగానే ఒక
191