పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/197

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అక్కడకు తీసుకొనిపోయి, బడిలో చెప్పిన పాఠము లకు తగిన బొమ్మను చూపవలెను. జర్మనీలో ఈశాలలు ప్రత్యేకముగానే ఉంటవి, బడి వస్తు ప్రదర్శనశాలలను 'మొట్ట మొదట ఏర్పాటు చేసిన వాడు పెస్టాలో జీ అనే అతను.పాఠమును చెప్పడ మే కాకుండా చూపవ లేనని అతని అభిప్రాయము. ఆతరువాత పెద్దగోడపటములు వచ్చినవి. వాటి చిన్న ప్రతులను తరువాత పాఠపు స్తకాలలో ఆ చ్చు వేయడ మారంభించినారు. పిమ్మట ప్రతి 'దేశములోను గోడపటములు, ఉపకరణములు చేసి, కం పెనీలవా రనేకరకములవి అమ్మడమారంభించి నారు. వీటిలోనుంచి ఉపాధ్యాయులు తమకు కా వలసినవాటిని ఏర్చుకోవలసివచ్చినది. ఇందుకో సమే బడులలో వస్తుప్రదర్శనశాల అవసరముపడి నది. పిల్లలు చదువుకొంటే చాలదు, వస్తువులను పరిశీలించవలెనని పెట్టాలోజీ అభిప్రాయము. కాని కేవలపరిశీలనము వల్ల లాభము లేదని ఇప్పుడను కొంటున్నారు. ఆయా పాఠములను పిల్లలు స్వయ ముగా ఆడవ లెనని ఇప్పటి అభిప్రాయము. ప్రతి


190