పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈతనివాదము. తనబడి లోనికి వచ్చే పిల్ల లలో సగ ము మందికే అతడు స్థలముంచినాడు. తక్కివారు ఆటస్థలములో చదువు నేర్చుకొంటారు. ఇష్టము వచ్చినవారు గదులలో ఉండవచ్చును. తక్కిన వారు బయట ఆడుకోవచ్చును.ఈతడు సాయంకాలము పిల్లలతండ్రులను బడికి పిలిచి పిల్లలతో ఆడుకోనిస్తాడు. సంవత్సరమునకు 12 నెల లున్ను, వారమునకు 7 దినములున్ను బడి ఉంచుతాడు. బడే పిల్లలకు ఇల్లన్న మాట, పిల్లలు బడిలో ఉన్నంత కాలమున్న బడే ఇల్లను కొనేటట్లు చేస్తాడు.

జర్మనీలో కూడా విశ్వవిద్యాలయముల వారున్ను, ఇతరులున్న ఇటువంటి విద్యాపరి శోధనాలయాలను స్థాపించి, కొత్తివిధ్యా పద్ధతు లను కనుక్కొనడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటు వంటి బడులలో ఒకటి ఈ క్రింద వర్ణింపబడినది.

ఈబడికి ఇన్సెల్ షూలే (Inse Schule)అని పేరు. ఇది 'బెర్లిన్ పట్టణమునకు దగ్గరగా ఉన్న ఒక ద్వీపముమీద ఉన్న ది. బెర్లిను పురపాలక


185