పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ అమెరికనువిద్యా పద్ధతులలో డాల్టను పద్ధతి, గారీ పద్ధతి అనేవి ఈ పరిశోధనలకు కొన్ని ఫలితము లను కోవచ్చును. డాల్టనుషట్టణములో మిస్ ఎ వెలిన్" డ్యూయీ అనే ఆమె అవలంబించిన పద్ధతికి డాల్టను పద్ధతి అని పేరు. దీనిప్రకారము ఉపాధ్యాయులు పాఠము చెప్పరు. అంతా విద్యార్థులే నేర్చుకో వలేను. ఉపాధ్యాయులు సలహామాత్రమిస్తారు. ప్రతివిద్యార్థికి వేర్వేరుగా ఉపాధ్యాయుడు భోధి స్తాడు. తరగతి మొత్తముమీద చదువు చెప్పడముండదు. ఈ పద్ధతిని ఇండియాలో బాగుగా అవగాహన చేసుకొనలేక , దానిని పాడు చేస్తున్నారు. విలియమ్ ఏ. వర్టు అనేఆయన గారీ అనే పట్టణము లోని తనబడిలో అవలంబించిన పద్ధతికి గారీ పద్ధతి అని పేరు. “ప్రతివిద్యార్థికిన్ని ఒక స్థలముండవలెను. ఆవిద్యార్థి ఆస్థలమును విడిచి పెట్టకూడదు” అనే వాదమును వర్టుగారు నిరసిస్తారు. పార్కులలో ఒకొక్క మనిషికి ఒకొక్క స్థలమును నియమించడ మెట్లక్కర లేదో, బడిలోకూడా ఒకొక్క విద్యా రికి ఏదో ఒక స్థలము నియమించ నక్కర లేదని


184