Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుకొంటున్నారు. యుద్ధ సమయములో కూడా చా లామంది ఈబడులలో చదువుకొనడానికి పోతూ ఉండేవారు. వీటిలోని ఉపాధ్యాయులను విశ్వ విద్యాలయాలలోని అధ్యాపకులు, ఉపన్యాస కు లలోనుంచిన్ని, ఉన్నత పాఠశాలలలోని ఉపాధ్యా యులనుంచిన్ని, సంఘకార్యనిర్వాహక వర్గమువారు ఏర్పాటు చేస్తారు. కార్మిక, వాణిజ్య విషయాలను ఇంజనీర్లున్న, వర్తకులున్ను బోధిస్తారు.

ఈబడులకు అన్ని వయస్సులవారున్ను వి ద్యార్థులుగా పోతారు. 20 ఏళ్ళ లోపువారు నూ టికి 13 రు, 21 నుంచి 30 ఏళ్ళవారు 41 మంది, 31 నుంచి 40 ఏళ్ళవారు 23 రు, 40ఏళ్ళ పై బడినవారు 23 రు ఈబడులలో చదువుకొంటున్నారు. ఈవి ద్యార్థులు ఆనేక వృత్తులనుంచి వస్తారు. దుకాణాల మీద ఫాక్టోరీలలోను పనిచేసేవారు నూటికి 51.8 మంది, ప్రభుత్వోద్యోగులు 14.4 మంది, కూలి వాళ్ళు 11,6 మంది, ఇంజనీర్లు 6 మంది సామా న్యవృత్తుల వారు 6 మంది, ఉపాధ్యాయులు 10.2 మంది ఇప్పుడు వీటిలో చడువుకొంటున్నారు.

182