పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/181

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కులతో కూర్చొని జరిగినదంతా వ్రాస్తాడు. వ్రా తపరీక్ష కంటే నోటిపరీక్ష చాలా కఠినముగా ఉం టుంది; సూక్ష్మపరీక్ష చేస్తారు. గుడ్డి పాఠముగా వల్లె వేయడానికి అవకాశముండదు. పరీక్ష జర్మను భాషలో జరుగుతుంది; కాని, అవసరమును బట్టి ఇంగ్లీషులో కూడా చేస్తారు. విద్యా స్థలమును విడిచి పెట్టకముందే పరీక్ష ఫలితమును చెప్పి వేస్తాడు. పరిక్షలో తప్పిపో తే, ఆ అవమానము అతనికి చదువు చెప్పిన అధ్యాపకు నిదిగాని, విద్యార్థిది కాదు. విద్యార్థి తన జీవితములో సంపాదించుకొనే కీర్త్యపకీర్తులు కూడా అధ్యాపకుని వే. మనపండితులు ఫ లానావారి శిష్యులమని చెప్పుకొన్నట్లే జర్మను డాక్టరు పరీక్ష ప్యాసయిన వారు తమ అధ్యాపకుల పేళ్ళను చెప్పుకొంటారు.


174