Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కున్నూ ప్రాథమిక పాఠశాలలోనె వుంటారు. ఆ తరువాత విద్య నేర్చుకోవలెననే నిర్భందము లేదు. పద్నాలుగేండ్ల వరకున్నూ పిల్లలందరూ ఏదో విధమైన బడిలోనికి పోయి తీరవలెను. ధనవంతుల పిల్లలు ఉన్నత పాఠశాలలకు పోయి జీతేములు చెల్లించుకొని పదహారేండ్ల వరకో పంతొమ్మిదేండ్ల వరకో, చదువు కొంటారు. ఐరోపాలోని చాల దేశములలో నిర్భంద విద్య పద్నాలుగేండ్ల వయస్సుతో సరి. కొన్ని దేశములలో కొంచెము తక్కువగా కూడ వున్నది. ప్రాన్ సులో పండ్రేండ్లకే విద్య చాలించు కోవచ్చును. ఒక పబ్లికు పరీక్ష ప్యాసైతే, పదకొండేండ్లకే మానుకోవచ్చును. ఇంగ్లాండు దేశములో ఈ వయస్సు పది హేనేండ్ల వరకూ హెచ్చించడానకు ప్రయత్నిస్తున్నారు.

జర్మినీ దేశములోని యీ నిర్భధ విద్య యొక్క గొప్ప ఏమిటంటే, మగ పిల్ల వాడు గాని ఆడ పిల్ల గాని పధ్నాలుగేండ్ల వరకున్ను నిర్బంధముగా చదువుకొని, తరువాత ఏదైనా ఒక వృత్తి నవలం



11