ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కొంచెము వేరుగా ఉంటుంది.వీరు ఒకకళాశా లలో మూడేళ్ళు చనువుకొని "స్టాటు” అనే పరీ క్షను మూడు విషయాలలో ఇవ్వవలెను-ఇదిగాక వారొక కొత్త విషయమును గురించి ఒక వ్యాస మును వ్రా యవ లెను- ఈ పరీక్ష, ఇంగ్లీషు విశ్వవిద్యా లయాలలోని బి.యే పరీక్షకు సరిపోతుంది, పరీక్షలు స్యాసయిన తరువాత ఉపాధ్యాయులు బోధనాభ్యసనకళాశాలలకు పోరు. వారిని ఆరు గురేసి చొప్పున హైస్కూళ్ళకుపోయి ప్రధా నోపాధ్యాయుల తనఖి కింద బోధనానుభవమును సంపాదిస్తారు. అచ్చట రెండేళ్ళయిన తరువాత ఇన్ స్పెక్టర్ సంఘ మొకటి ఏర్పడి వీరినిపరీక్షిస్తారు.
అధ్యాయము 19
జర్మను పరీక్షలు.
ఇంగ్లాండులోను. ఇండియాలోన వలె, జర్మ నీలో నెలకొకసారి, టెర్ముకొక సారి, సంవత్సరమున కొకసారి పరీక్షలు లేవు. ప్రతి సంవత్సరమున్ను
169