Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బోధనాభ్యసన కళాశాలలో చేరే విషయాలే కాకుండా, ఉపాధ్యాయులు "బాలురకు నేర్పవలసిన విషయములనుకూడా బోధిస్తారు. ఈపాఠశాల లకు అనుబంధించి ' సాధారణ పాఠ శాలలుండవు. విద్యార్థులు దగ్గరగా ఉన్న సాధారణ పాఠశాల లలో అనుభవము సంపాదించుకోవలెను. ఈ బోధ నాభ్యసన కళాశాలలను ప్రత్యేక ముగా ఉంచవలెనా, లేక విశ్వవిద్యాలయము లకు చేర్చవలెనా, అని ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగు తున్నది. కొన్ని విశ్వవిద్యాలయముల వారు వీటిని చేర్చుకొన్నారు. . కొందరు చేర్చుకో లేదు, రోమను కేథొలిక్కులు తమమతమునకు భంగము కలు గుతుందేమో అని, రోమను కేథోలిక్కులు వీటిని విశ్వవిద్యాలయాలలో చేర్చుకోకుండా అడ్డు తగులు తున్నారు. శాసనసభలలో ఏ సంఖ్య ఎక్కువగా ఉండడము చేత ప్రభుత్వము వారి కష్టమున్నా వీటిని విశ్వవిద్యాలయములలో చేర్చడానికి వీలులేక పోతున్నది.

ఉన్నత పాఠశాలో పాధ్యాయుల శిక్షణము -

168