ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మెంటు వారు ఉపాధ్యాయులకోసము ప్రత్యేక క ళాశాలలను ఏర్పాటు చేసినారు. విశ్వవిద్యాలయాధికార మిచ్చినారు.ఈకళాశాలలకు ఆ యామతముల ప్రకారము ఏర్పడినవి. ఒకొక్క మతమునకు సంబంధించినట్లు వీటిలో ఉపా ధ్యాయశిక్షణ మిస్తున్నారు,
జర్మనీ లోని ప్రారంభ పాఠశాలలు ఆయా మతము ననుసరించి ఉంటవనిన్నివీటిని ప్రభు త్యము వారు పోషిస్తారనిన్ని, ఈబడులలోని ఉపా ధ్యాయులకు మతసంబంధ మైన బోధనాభ్యసన 'పాఠశాలలలో శిక్షణమిస్తారనిన్ని , ఇంతకుముందు చెప్ప బడినది. రోమను కేథొలిక్కులు, ప్రో టెస్టాంటులు ఈ రెండుమతములవా రే జర్మనీలో ముఖ్యులు. లో రోమను కాథోలిక్కులకు ఒకటిన్ని, పోట స్టాంటులకు రెండున్న , మతములతో సంబంధించనిది ఒక టిన్ని, బోధనాభ్యసన కళాశాలలు జర్మనీలో ఉన్నవి. ఈ పాఠ శాలలలో రెండేళ్ళు చదివినతరువాత విద్యార్థు విశ్వవిద్యాలయములో చేరుతారు. ఈపాఠశాలలలో సాధారణముగా
167