పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/173

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లలో చేరక పూర్వము ఉపాధ్యాయులు ప్రారంభ పాఠశాలలలోనో మాధ్యమిక పాఠశాలలలోనో చదువుకొనేవారు సెమినారులలో ఉపాధ్యాయులు మూడేళ్ళు చదువుకొన్న తరువాత ఒకకఠిన మైన పరీక్ష జరిగేది. తరువాత వారు తిరిగీ బడులలో మూడేళ్ళు పనిచేసి మరి ఒక పరీక్ష ఇచ్చేవారు. చదు వు చెప్పడమునుగురించి పుస్తకములు చదువడ మే కాక, చదువు చెప్పే అనుభవమునుకూడా సంపాదిం చేవారు. ఉపాధ్యాయశిక్షణమేమో సెమినారులో బాగుగానే ఉండేదిగాని, వీరికి శాస్త్రజ్ఞాన మేమిన్ని లేకుం డేది. యుద్ధమునకు పూర్వమే ప్రారంభ పాఠ శాలో పాధ్యాయులు హైస్కూళ్ళలోను, కళా శాలలలోను చదువుకొనక పోవడము చేత సంఘ ములో తమకు గౌరవము లేకున్నదనిన్ని , కళాశాలా విద్యార్థుల స్వాతంత్యము తమకు లేదనిన్ని ఫిర్యాదు చేసేవారు. యుద్ధ సమయములో ప్రారంభ పాఠశాల ఉపాధ్యాయుల కూతుళ్ళను పెళ్ళి చేసుకొనే సైనికోద్యోగుల ఉద్యోగములు తీసి వేసేవారు. కాని, 1920, 1921 సంవత్సరములలో గవర్న

166