పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొంది, దుకాణాలమీద పని నేర్చుకొంటు ఉన్న బాల బాలికలను వీటిలో చేర్చుకొంటారు. వీటిలో పిల్లలు మూడేళ్ళు చదువుకోవలెను; పిల్లలకు జీతము లివ్వరు. పరీక్ష ప్యాసయిన తరువాత దుకాణముల మీద గుమాస్తాలఉద్యోగములు చేయడమునకు వా రర్హు లవుతారు. ఒక్క ప్రషియా దేశములో ఇటువంటిబడులు 607 ఉన్నవి; వీటిలో 386 ప్రత్యేకముగానూ, 281 వృత్తి బడులకు చేరిన్ని ఉన్నవి. వీటిలోని పిల్లలసంఖ్య 130,225, ఆ సంఖ్యలో ఆడ పిల్లలు 55,591. జర్మను భాష, చిట్ఠా ఆవర్జాలు వ్రాయడము, టైపు రైటింగు, సంక్షిప్తలేఖనము, హణిజ్య శాసనముల ప్రథమ పాఠముల, వాణిజ్య భూగోళ శాస్త్రము, కసరత్తు, విహారములు- ఈ విషయములు తక్కినబడులలోవలె వీటిలో కూడా నిర్బంధములు,

ఉన్నత వాణిజ్య పాఠశాలలు,

ఇవీ (1) హంటెల్ షూలే (వాణిజ్య పాఠ శాలలు) (2) హెహెర్హంటెల్ సూలె (ఉన్నత వాణిజ్య పాఠశాలలు) అని రెండు విధము

155