పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జర్మను పిల్లలు సాధారణముగా ఆరేండ్ల వస్సు వరకు తమ ఇండ్లలోనే చదువు కొంటారు. తల్లి దండ్రులు తమ పిల్లల చదువులను సరిగా చూచుకోలేనప్పుడు వారిని కింటర్ గార్టెన్ (kinder garten schools)బడులకు పంపుతారు. తల్లి దండ్రులు లేని పిల్లలనున్ను , తల్లి దండ్రులు సరిగా చూడని పిల్లలనున్ను, పోషణ గృహములకు పంపుతారు. ఈ పోషణ గృహములను పురపాలక సంఘమువారు నడుపుతారు. నూటికి పది మంది మాత్రమే పిల్లలు కింటర్ గార్టెన్ బడులకు పోతారు. ఆరేండ్ల నుండి పదేండ్లవరకూ వయసు గల పిల్లలందరు, గొప్ప వారైనా సరే వారి తల్లిదండ్రుల రాబడి ఎంత అయినా సరే, చట్టము ప్రకారము గృంట్ షూలె (grund schule) లేక ఐన్ హేట్షూలే(Einheit shule) అన బడే సాధారణ పాఠశాలలకు పోయి తీరవలెను. ఈ సాధారణ పాఠశాలలలో పిల్లలు జీతము లిచ్చుకోనక్కర లేదు. పేదపిల్లలకు అన్నము, బట్టలు, పుస్తకాలు కూడ ఇస్తారు.

9