ముల హక్కులను కలిగిఉన్నవి. వీటిలో డాక్టరు బిరుదమునిస్తారు. జర్మనీలో ఇటువంటి కాలేజీలు ఇంజనీరింగు వృత్తికి పదిన్ని, వ్యవసాయమునకు నాలుగున్ను, అడవులకు అయిదున్ను ఉన్నవి. తక్కిన విశ్వవిద్యాలయములలోనికి ఎట్లు ప్రవేశిం చడమో, వీటిలోను అట్లే ప్రవేశించవలెను. ఇం దులో చేరదలచిన జర్మను విద్యార్ధులు ఆబిట్యూ రియేంటెస్ పరీక్షను, విదేశ విద్యార్థులు తమ దేశ ములలోని విశ్వవిద్యాలయాలలోనికి ప్రవేశము నిచ్చేపరీక్షనున్ను ప్యాసయి ఉండవ లెను,కాలే జీలో ఇంత మందిని మాష్ట్రమే చేర్చుకొంటామన్న నియమము లేదు. స్థలములేదన్న కారణము చేత ఎవగినిన్ని చేర్చుకోక పోరు. అందరు విద్యార్థులన్ను కలిసిపని చేసుకొనడానికి సదుపాయాలు లేకపోతే, తుకిడీలుగా పని చేసుకొంటారు,
ఈ విశ్వవిద్యాలయాలలో రెండు పరీక్ష లున్నవి. ఒకటి “డిప్లొమా " పరీక్ష. రెండోది “డాక్టరు" పరీక్ష్ . డిప్లొమాపరీక్ష, బ్రిటిషు విశ్వ విద్యాలయాలలోని బి. ఎస్. సి. పరీక్షకు సరిపో
151