పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చదువు అయావృత్తులకు తగినట్లు ఉంటుంది. పిల్లలు పుస్తకములు చదువుకొనడమే కాకుండా అనుభవముకూడా సంపాదిస్తారు. ఈ వృత్తికాక, జర్మముభాష, గణికము, చిత్రలేఖన ము, రాజనీతి ప్రథమపాఠములు, చిఠా ఆవర్జా వ్రాయడము, కసరత్తు, కూడా ఈ బడులలో నేర్పు తారు. తక్కిన బడులలోవలె వీటిలో కూ డా విహారములు, వ్యాయామకీడలు, నిర్బందములుగా ఉంటవి. ఆయావృత్తులలో మంచి ప్రగ్న సంపాదించిన వారే ఈబడులలో ఉపాధ్యాయులుగా ఉంటారు. ఒకొక్క వృత్తికి ప్రత్యేకముగా అను కూలించేటట్లు చిత్రలేఖనము, గణితము, క్షేత్రగణితము మొదలయిన విషయాలకు పాఠక్రమము లున్ను పాఠపుస్తకములున్ను వ్రాయబడి ఉన్నవి. వడ్రంగమునకు పనికివచ్చే గణితము, చిత్ర లేఖన ము, మరిఒక వృత్తివారి కుపయోగించవు. వడ్రంగము తరగతిలో కుర్చీలు మొదలయిన వాటి కుపయోగించే లెక్కలు, చిత్ర లేఖనమును మా త్రమే చెప్పుతారు. ఇతర వృత్తుల వారికి వారి

142