పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/146

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీళ్ళిద్దరికి మంచిశిక్షణము కావలెను. వ్యవసా యమునకు సహాయముగా జర్మనీలో ఈ మధ్య గృ హపరిశ్రమలు మంచి అభివృద్ధి పొందినవి. యూరోపులో వ్యవసాయము ఏడు నెలలు మాత్రము సాగుతుంది. చాలికాలము అయిదు నెలలు వ్వవసాయపుపని ఉండదు. ఆకాలమును వృథాచే యకుండా వ్యవసాయదారులు ఏదో ఒక గృహ పరిశ్రమ చేస్తారు. ఈ పరిశ్రమలలో ముఖ్యమ యినది పిల్లల ఆటవస్తువులను చేయడము. జర్మను లిప్పు డెన్నోరకాల ఆటవస్తువులను చేస్తున్నారు. ఇవన్నీ వ్యవసాయదారులు చేసేవే. వీటిని చే యడానికి ఇంజనులతో పనిచేసే పెద్దయంలో లక్కర లేదు. వీటిని చేసేయంత్రాలను ఒక చోటినుంచి మరిఒక చోటికి మోసుకొనిపోపచ్చును. వీటిని చేతులతోగాని, చిన్న మోటారు ఇంజనుల తోగాని నడిపించవచ్చును. మే స్త్రీ శిక్షణమున్ను , ఒక పరిశ్రమ యజమానుని శిక్షణమున్ను ఒక టేకాకపోయినా, ఒక్కరకమువే. జర్మనీలో ఆయావిధములవారికి


139