పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భవనముకట్టవలె ననుకొందాము. ఇంజనీరు ప్లాసులు గీసి, శ్రమను తగ్గించేయంత్రాలను ఏర్పాటు చేస్తాడు. ఒక ఆర్చిదింపడ మేలాగో, ఆ ఆర్చిలో ఎక్కడ ఎంతబరు వుంటుందో ఇంజనీరుకు తెలు స్తుంది. కాని, ఆ ప్లానుప్రకారము ఇటికలను పేర్చడానికి ఒక మే స్త్రీ ఉండవలెను. మంచి ఇంజనీరయినవాడు, మంచి మే స్త్రీ అయి ఉడనక్కర లేదు. మే స్త్రీ ఎన్నో ఆర్చీలను కట్టి ఉడవచ్చు నుగాని, మరిఒక కొత్తరకము ఆర్చి కట్టలేడు. మే స్త్రీ కింద కొంతమందిపని వాళ్ళు కూడా ఉండవలెను. వీరు చదువుకొన్న వారైతే తమపనిని మరింత బాగా చేసుకొని తమశ్రమ తగ్గించుకొన డానికి ఉపాయాలు ఆలోచించుకోగలరు. ప్రతి విషయములోను ఇప్పుడు యంత్రములు సహాయ పసుతున్నవి గనుక, ఈ పని వాళ్ళు తమపనిలో కుశలత సంపాదించవలసి ఉంటుంది. అందుచేతనే వీరికికూడా కార్మిక విద్య అవసరము.


గృహపరిశ్రమలకు ఇంజ నీర్లు అక్కర లేదు.మే స్త్రీలు, పనివాళ్ళు, ఉంటే చాలును,

138