పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నులకు నమ్మకము లేదు. ఉపసంఘమువారు మొత్తముమీద చూచుకొంటారు. ప్రత్యేక విషయాలను ప్రత్యేక వ్యక్తులే చూస్తారు. స్థానిక శాఖల వారిచ్చే విద్యార్థి వేతనములు మూ ల సంఘమువారి చ్చేవాటికంటె వేరు గా కూడా ఉంటవి. వీరుకూడా విద్యార్థులకు చేబదుళ్ళిస్తారు. విద్యార్థికి వేతనములు కావలసినవా డొక ఫారమును నింపవలెను, దీనిలోని విషయములు సరిగా ఉన్నవో లేవో పోలీసు వారు సరిచూస్తారు. ఈ విద్యార్థి వేతనములను, ప్రభుత్వమువారును, సం ఘమువారును ఇచ్చే అప్పులను, ఏ దేశీయ విద్యార్థులు కూడా పుచ్చుకోనచ్చును.

ఈశాఖలకు (1) టెర్ముకు ప్రతివిద్యార్థి 1 1/2 పిల్లింగుల చొప్పున చెల్లం చేసొమ్ము (2) డ్రెస్టెను లోని మూల స్థానము వారిచ్చే సొమ్ము (2) పయి పటు చందాల సొమ్ము (4) విశ్వవిద్యాలయము లోని విద్యార్థికి 2 1/2 పెన్సుల చొప్పున ప్రభుత్వ మువారిచ్చే సొమ్ము-ఇ దేరాబడి.

ఈ సంఘము ఉద్దేశములు, దాని రాబడి,

132