పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జర్మసు విశ్వవిద్యాలయాలలో ఉపన్యాసా లిప్పి స్తారు. ఈ ఆధ్యాపకుల ప్రయాణఖర్చులను సంఘమువారు భరించి, వారిని బాగుగ సత్కరించి, ఉపన్యాసాలకు ఏర్పాటు చేసిన టిక్కట్ల సొమ్ము లో కొంతభాగ మిచ్చి వేస్తారు. జర్మను విద్యా ర్డులకు అమెరికాలోని ఫాక్టోరీలలోను అమెరికా విద్యార్థులకు జర్శన ఫాక్టరీలలోను అనుభవము కోసము ఏర్పాటు చేస్తారు. జర్మను విశ్వవిద్యా లయాలలో చదువదలచే విద్యార్థులకు విద్యార్థి వేతనము లిస్తారు. విదేశీయ విద్యార్థులకు జర్మను విశ్వవిద్యాలయాల భోగట్టా తెలుపుతూ ప్రతి సంవత్సరమున్ను ఒక పుస్తకము ప్రకటిస్తారు. ఇండియా విద్యార్థులకు ఈ శాఖవారే విద్యార్థి వేత నము లిస్తారు.

విశ్వవిద్యాలయ స్థలము లలోని సహ కారశాఖలు.

మూల స్థానమునకు ప్రతి విశ్వవిద్యాలయ స్థానములలోను ఒక శాఖ ఉంటుంది. ఈ శాఖకు కూడా ఒక కార్యనిర్వాహక వర్గ ముంటుంది. ఇందులో అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థులు


130