పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లు వసూలు కావు. అట్టి నష్టమును పూర్తి చే యడానికి జర్మనీ లోని 40 విశ్వవిద్యాలయముల లోను చదువుకొంటు ఉన్న ప్రతివిద్యార్థిన్ని టెర్మకు 15 పెన్సులు చెల్లించవలెను. విదేశీయ విద్యార్ధులకిచ్చే అప్పులు వాపసు కావడము ఎ క్కువ గనుక విదేశీయ విద్యార్థులు ఒటెర్మకు 4 షిల్లింగుల 6 పెన్సులు నములు చేయడానికి ఆలోచిస్తున్నారు.

విద్యార్థులకు ప్రత్యేక త్యేకముగా స హాయము చేసే రెండో శాఖలో అనేక భాగము లున్నవి. వాటిలో ముఖ్యమైనది. రోగిష్ట విద్యా ర్థులను ఆరోగ్యస్థలము కు పంపించేది.జర్మినీ లోను, ఇతర దేశములలోను ఉన్న ఆరోగ్యస్థలాలకు సంవత్సరమునకు 200 మంది విద్యార్ధులను సంఘ మువారు పంపించి, వారికయ్యే ఖర్చంతా తామే భరిస్తారు. ఈశాఖలోని విదేశీయభాగము చా లా మంచిపని చేస్తున్నది. అంతర్వీశ్వవిద్యాలయ సభలకు ఈశాఖవారు సభ్యులను పంపుతారు. ఇతర దేశాల అధ్యాపకులను ఆహ్వానము చేసి,

129