పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరు తెలుపుతూ ఉంటారు. సంఘమువారే కా కుండా గవర్నమెంటు వారున్ను విద్యార్థుల కోసము సహాయనిధి నొక దానిని ఏర్పాటు చేసి ఈ సంఘమువారి సలహాపై "కూరే టరు” సొమ్ము పంచి పెట్టు తాడు.

పైని వివరించిన సదుపాయములన్నీ విదేశీ విద్యార్థులకు కూడా చేస్తారు. ఈపనులను నిర్వహించడానికి సంఘములో ప్రత్యేక శాఖ ఉన్నది. 1928 సం|రములో చీనా విద్యార్థుల కోసము వారు విద్యార్థి వేతనములను ఆయా విశ్వ విద్యాలయాలకు పంచి పెట్టినారు. ఈసదుపా యాలతో విదేశీయ విద్యార్థి నెలకు 10 పౌనుల మోతాదు ఖర్చుతో కాలక్షేపము చేసుకో గలడు. ఈ సొమ్మయినా డ్రెస్డెను పట్టణములో మూల స్థానమునుండి అప్పు పుచ్చుకోవచ్చును. విద్యార్థులు రైలుబండ్లలో మూడో తరగతిలో సగము ఛార్జీల మీద ప్రయాణము చేస్తారు. విదేశీయ విద్యార్థులు మొదట నిండు ఛార్జీ చెల్లిం చినా, రైలు స్టేషనులో ఆవిషయమై ఒక కాగితము

125