పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయము 13.

జర్మని విద్యార్థుల సహకార సంమము.

చాలామంది జర్మను విద్యార్థులు యుద్ధసమయము- చనువుమాని యుద్ధములో సైనికు గా ప్రవేశించినారు. యుద్ధ మంతము కాగానే విద్యార్థులు తిరిగి చదువుకొనడానికి ధన సామర్థ్యము లేకపోయినది. ఇంగ్లాండులో,ఈ సమస్య వచ్చినది కాని, ప్రభుత్వము నా రున్న విశ్వవిద్యాలయాల వారున్ను విద్యార్థులకు యుద్ధమునుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు ఇంగ్లీషు ప్రభుతము వారు ప్రత్యేక విద్యార్థి వేతనము లిచ్చినారు; విశ్వవి ద్యాలయము వారు సంఖ్యతో నిమిత్తము లేకుండా వచ్చినవారి కందరికిన్ని ప్రవేశమిచ్చి, సాధ్యమయి మట్టుకు సహాయము చేసి, శీఘ్రకాలములో వారివారి పట్టములను సంపాదించు కొనగలిగినట్లు పాఠక్రమమును, పరీక్షలను మార్చినారు, జర్మను ప్రభుత్వము వారికి విద్యార్థులకు సహాయ ము చేయడానికి డబ్బు లేకపోయినది. విశ్వవిద్యా

120