పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పై విద్యార్థులను తమ కుటుం బాలలో చేరనివ్వరు. యూరోపు ఖండములో కుటుంబీకులు విద్యార్థులను చేర్చుకొని, వారికి తమ నౌకరులు పనిచేస్తే ఊరుకొంటారు. ప్రేగు (Prague) పట్టణములో విద్యార్థుల వసతులకోసము కొత్తగా ఏర్పాటు జరిగినది. జెక్కులకున్న జర్మనులకున్న భాషా భేదము వలను సంప్రదాయ భేదముల వల్లను సరిపడదు. అందుచేత ఆపట్టణములో జేక్కు విద్యా రుల కొక వసతిగృహమున్న, జర్మను విద్యార్థుల కొకటిన్ని కట్టినారు. ఉన్నత పాఠశాలల కంటె పై తరగతులలో చదువుకొనే విద్యార్థులందరున్ను ఈ వసతిగృహములలో ఉండవచ్చును. ఈ రెండు వసతిగృహముల లోను ఒకటి ఈకింద వర్ణింప బడినది


ఈహాస్టలును స్థాపించినది ఒక ప్రయివేటు కమిటీవారు. ఈ కమిటీలో జెకో-స్లో వేకియా రిపబ్లికు అధ్యక్షుడు నియమించిన ఒకడున్ను, ఆ దే శము మంత్రులు ఐదుగురు నియమించిన అయిదు గురున్ను, ప్రేగు పురపాలక సంఘమువారు నియ

117