పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూడి, తమతమ సంఘాలసభ్యులలో ఈ పోరులను ఏర్పాటు చేస్తారు. క్రొత్తగా సంఘములో చేరిన విద్యార్థి ఒక పోరులో జయము పొందే వరకు "ఫ్లూక్సు" గానే ఉంటారు గాని, పెద్ద సభ్యు కు "బుర్ష్” (Bur sch) కాజాలడు. ఈ పోరులలో చాలావాటి ని సంఘాల అధ్యక్షులే ఏర్పాటు చేస్తారు, కాని, విద్యార్థులలో ఇద్దరికి పెద్దతగవు పుట్టు తే, వారు ఎక్కటి పోరు చేసి తమ తగవు తీర్చుకొంటారు. ఈ ఎక్కటి పోరుకు చాలా ఖర్చవుతుంది గనుక ఎవ రో ధనవంతుల బిడ్డలే వీటిలో చేరుతారు. సభ్యు లందరి మొలమీదను కత్తిపోట్ల మచ్చలుంటవి. ఈ మచ్చలు మగవారి అందమనకు లక్షణమని అనుకొంటారు. జర్మనీ దేశములో శాస్త్ర పరిశోధన విహారములు విద్యార్థి జీవనములో ముఖ్యములు. ఈ విహారాలను అధ్యాపకులు ఏర్పాటు చేసి, విద్యార్థులను కార్మిక ప్రాముఖ్యముగల పట్ట ణములకు తమతో తీసుకొనిపోయి, ఆయా పరిశ్ర మను గురించి వివరముగా తెలుపుతారు.

115