ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సామ్రాజ్యము అనే అభిప్రాయము ప్రబలినకొద్దీ సామ్రాజ్య భక్తియే ఆధారముగా ఈ సంఘ ములు ఏర్పడుతున్నవి. అంతకంతకున్ను ఆటల మీద ఆసక్తిపుట్టి, అది ఎక్కటిపోరులలోనికి పరి ణమించినది,
ప్రస్తుత మీసంఘాలు కొంతవరకు అల్పా హారాలకోసమున్ను, కొంతవరకు ఆటలకోసమున్న ఏర్పడి ఉన్నవి. విద్యార్థులు "క్నీపె” సభలలో చేరి పాటలు పాడుకొంటూ, హాస్యోపన్యాసాలు చేస్తూ, విహారాలకు పోతూ ఉంటారు, సభ్యులందరు న్ను కలిసి ప్రత్యేక గృహాలలో భోజనాలు చేస్తారు. కాని, ఎక్కటిపోరు చేయడమే ఈ సంఘాల ము ఖ్యోద్దేశము. ఈపోరు,ముష్టి యుద్ధమును (Boxing)పోలి ఉంటుంది. దీనిలో పిడికిళ్ళకు బదులుగా వాడికత్తులను ఉపయోగిస్తారు. పోరు జరిగేటప్పు డు గాయములకు కట్టుకట్టడానికి ఒక వైద్యుడు తప్పకుండా ఉంటాడు. టెన్నిసు, ముష్టి యుద్ధము లవలె, ఎక్కటిపోరులు స్నేహముగానే జరుగుతవి. ఏడెనిమిది సంఘాల అధ్యక్షులు వారానికొకసారి
114