Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొన్ని ఒకరితో ఒకరు కలిసి పరిచయము కలిగిం చుకొనడమునకున్ను, కొన్ని ఇట్టి పరిచయమే కుండా శాస్త్ర విషయాలను, సాహిత్య విషయాలను చర్చించుకొనడమునకున్న ఏర్పాటయి ఉంట వి. రెండో తరగతి సంఘములు గణితము, వేదాం తము , చరిత్రము, మొదలయిన విషయాలను బట్టి వేర్వేరుగా ఉంటవి. ఈ సంఘములకు ఒక అధ్య క్షుడు, ఒక కార్యదర్శి, ఒక అలంకార కార్యదర్శి, ఒక కోశాధిపతి ఉంటారు. వీరిని విద్యార్థులే ఎస్ను కొంటారు. వీరు ఒక్క ఓర్ము మాత్రమే ఆ ఉద్యోగములో ఉంటారు.. జర్మను విశ్వవిద్యాలయములో నవంబరు ఆరంభమునుంచి ఈస్టరువరకు ఒక టిన్ని , మే నెల మొదలు ఆగస్టు మధ్యవరకు ఒక టిన్ని 'రెండే టెర్ములుంటవి. మొదటి రెండు సంవత్సరముల విద్యార్థులు చేత పై సంవత్సరముల విద్యార్థులు పసులను చేయించుకొంటారు. ఈ క్రింది విద్యార్థులకు "ఫూక్స” (luclas) అని పేరు. వారానికి ఒక సభ జరుగుతుంది. అందులో ఒక విద్యార్థి తప్పకుండా ఒక వ్యాసమును చదువు


109