ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ది తరగతులలో ఉండే విద్యార్థులకు అతిముఖ్య ములయిన “విద్యార్థుల సంఘములు" జర్మనీలో లేవు. కాని, ప్రతివిశ్వవిద్యాలయానికిన్ని ఒక పఠనాలయముంటుంది. దీనితో ఒక గంధాలయముకూడా చేరి ఉంటుంది. పఠనాలయమును చూడడానికి సగము మంది విద్యార్థుల న్ను సగము మంది అధ్యాపకులున్న గల ఒక ఉసంఘముంటు , వీరిని సభ్యులు ఎస్ను కొంటారు. యుద్ధానంతరము ఈ పఠనాలయాలకు ఎక్కువ మంది పో తున్నారు. విద్యార్థులకు చర్చా సంఘములు లేవు.. చర్చను ఏలాగు సాగించడమో జర్మను విద్యార్ధులకు తెలియదు. కొంత మంది అధ్యాపకులతో కలసి ఒక అధ్యాపకును ఒక చర్చాసంఘమును ఆ రంభించినాడు గాని, వివాగ్దస్తములయిన రాజకీయవిషయముల పై అందరున్ను సకారణముగా ఏకాభిప్రాయమునకు రాలేకపోవడము చేత, ఈ ప్రయత్నమును మానుకొన్నారు.
కాని, మరిఒక విధమైన విద్యార్థి సంఘము లున్నవి. ఇవి రెండు విధములుగా ఉంటవి.
108