పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుకొన్నారు. వీటిలో అంత ఎక్కువ ఖర్చుకాదు. వసతి, ఉపన్యాసముకు పోవడము, ఇతర పనులు - వీటి విషయములో ఇతర దేశములలో కంటె జర్మనీలో విద్యార్థులకు ఎక్కువ స్వాతం త్యమున్నది. విశ్వవిద్యాలయమువారు ఎట్టి నిర్బంధమున్ను చేయరు. మొన్న మొన్నటివరకున్ను దేశ చట్టములను అతిక్రమించిన విద్యార్థిని గవర్నమెంటు మేజ స్ట్రేటు విచారిం చేవాడుకాడు. పోలీసువారు ఆ విద్యా ని పట్టుకొని అతడా కళా శాలవా డే అని రుజువు చేస్తే విశ్వవిద్యాలయాధి కారికి ఒప్పగించేవారు, యునివర్సిటీ మేజిస్ట్రేటే ఆ కేసును విచారించేవాడు. ఇప్పుడీ విద్యార్థుల హక్కును తీసి వేసినారు. కాని విద్యార్థి నేరము చేసినప్పుడు అతనిని అరెస్టు చేసిన సంగతిని విశ్వవిద్యాలయాధికారులకు తెలుపుతారు. తని పక్షమున వాదించడానికి విద్యాలయాధికారు లు తగిన సదుపాయములు చేయవచ్చును,

విద్యార్థుల జీవనము

ఇంగ్లాండులో విశ్వవిద్యాలయాలలోని క్రిం

107