పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నక్కడ ఉండడము చేత విశ్వవిద్యాలయము పని తప్పు దారిపట్టదు. ఉపాధ్యాయవర్గము, విశ్వవిద్యాలయములోని ఉపాధ్యాయులు అధ్యాపకులు (Professors), ప్రయి వేటు ఉపా ధ్యాయులు, అని రెండు తెగలుగా ఉంటారు. అధ్యాపకపకులను ఆ యా ఫేకల్టీవారి సిఫార్సుల మీద మంత్రి నియమిస్తాడు. 'ఫేకల్టీవారు మూడు నాలుగు పేర్లు పంపిస్తే వారిలో ఒకరిని మంత్రి ఎంచుతాడు. మంత్రి ఫేకల్టీవారు సిఫార్సు చేసిన వారిలోనుంచే అధ్యాపకులను నియమించవలెనని నిగ్బంధము లేదు. కానీ, అతడు సాధారణముగా వారి సిఫార్సును తోసి వేయడు. వారు కూడా బాగా ఆలోచించి సిఫార్సులు పంపుతారు. వారు సాధారణముగా తమలోనుంచి అనుభవజ్ఞులయిన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉంటారు. ఈ కమిటీవారు దేశములో అధ్యాపకులుగా ఉండదగినవారి పేళ్ళనన్ని టిని ఆలోచిస్తారు. జర్మసీలో ఈ అధ్యాపక పదవులకోసము దరఖా

94