పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక్క సంవత్సరమే ఆ పదవిలో ఉంటాడు. సంవత్సర మయిన తరువాత మరి అతనిని ఎన్నుకో కూడదు. ఈ " రిక్టోయర్ ” కున్ను, ఆయా ఫేకల్టీల “డెక్కా "నులకున్ను , అధ్యాపకులుగా వారి కిచ్చే జీతము కాక, మరి కొంచెము సొమ్ముకూడ ఇస్తారు. జర్మను విశ్వవిద్యాలయాలలో "కూరేటర్ ” అనే ఒక్క ముఖ్య ఉద్యోగి కూడా ఉంటాడు. ఇతను ప్రభుత్వము వారీ సివిల్ సర్వీసు ఉద్యోగి. ఇతనికి విశ్వవిద్యాలయ పరిపాలనముతో ఏమి జోక్యము లేదు. కాని, అతడు విశ్వవిద్యాలయ స్థలములో నే ఎల్లకాలమున్ను ఉండి అక్కడ జరుగుతూ ఉన్న పనిని గమనించి, దాని విషయమై ప్రభుత్వము వారికి తెలుపుతూ ఉంటాడు. విశ్వవిద్యాలయమువారికిన్ని, ప్రభుత్వమువారికిన్ని, జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈతని ద్వారా జరుగవలెను. మంత్రి సాధారణముగా ఈయన సలహానే అనుసరిస్తాడు. ఇతడు విశ్వవిద్యాలయము పనిలో జోక్యము కలుగ జేసుకోక పోయినా, తా

98