పుట:JanapadaGayyaalu.djvu/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
నీకు గరగెత్తిలేని ఎన్నెలా
నాకేమి యిస్తావు ఎన్నెలా
నాకు గరగెత్తిలేని ఎన్నెలా
నా పాడావునిస్తాను ఎన్నెలా
నీ పాడావు నాకొద్దు ఎన్నెలా
నీ గరగనే నెత్తను ఎన్నెలా
నాకు గరగెత్తుతేని ఎన్నెలా
నాగున్నెద్దు నీకిత్త ఎన్నెలా
నీ గున్నెడు నాకొద్దు ఎన్నెలా
నీ గరగనే నెత్తినె ఎన్నెలా
నాకు గరగెత్తిలేని ఎన్నెలా
నా నాగరం ఇత్తాను ఎన్నెలా
నీ నాగరం నాకొద్దు ఎన్నెలా
నీ గరగనే నెత్తనె ఎన్నెలా
అటు అయితే నీ మనసు ఎన్నెలా
నేనే వస్తానులే ఎన్నెలా

సేకరణ-------కాకినాడ