పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన బాలికను చూస్తూ వుండగా పద్మావతి మనస్సులో ఆమె జీవితం యావత్తూ సినిమావలె తేలిపోతూ ప్రవహించి జరిగిపోయింది.

పువ్వులు, పూవులే ప్రోవుగా జన్మించిన సాగరిక; తనకు పరమేశ్వరుడైన భర్త పోలికలతో, మురళీ మనోహరుడైన బాలగోపాలునిలా “వ్యాసమూర్తి” తన బాలుడు; ఆ తోట, తనభర్త చిన్ననాటి గురువై, తన కుటుంబానికి సంరక్షకుడైన నరసింహమూర్తి మేష్టారు; అన్నీ కరిగిపోయి, సముద్రతీరంలో సముద్రహోరు శ్రుతిగా జీవితమూర్చన రచించుకొనే తన పల్లె ప్రత్యక్షం అయినది.


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు-7

96

జాజిమల్లి (సాంఘిక నవల )