పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రియతమా? ఇంతవరకూ పురుషమూర్తి యొక్క అద్భుత సౌందర్యం గమనించాము. ఈ స్త్రీ విగ్రహ సౌందర్యం ముందు ఇతర సౌందర్యం పోల్చడానికి ఎవరికి సాహసం ఉంటుందీ?”

“ఈ సౌందర్యం నాకు కాస్త చెప్పు ప్రాణాధికా.”

“ఓయి వెఱ్ఱివాడా, నువ్వు వట్టి శాస్త్రజ్ఞుడవులా కనబడుతున్నావే?”

“నువ్వు వట్టి డాక్టరువు కాదు కాబోలు.”

“డాక్టరుకు శరీర సకలమూ పరమాద్భుత సృష్టి రూపమని తెలుసును."

“అవును.”

“పరమ సౌందర్యవంతమయిన బాహ్య శరీరమూ మాకు తెలుసును.”

"ఆ సౌందర్యం ఒక చక్కని యంత్రంవంటిదిగానే మీరు భావిస్తారా? లేక కవులు వర్ణించే సౌందర్యంగానా?”

“కవులు వర్ణించనక్కరలేదు సౌందర్యాన్ని! సువాసన నువ్వు ఆఘ్రాణించి ఆనందం పొందుతావు కవులు వర్ణించి చెప్పాలా! అలాగే సౌందర్య భావమూ!"

“అద్భుతం!”

“ఏమిటి అద్బుతం?”

“నీ సౌంద్యం!”

“నేను సౌందర్యవతినని ఎలా తెలుసును?”

“నువ్వు ఈ విగ్రహం సౌందర్యవంతమైనదని ఎలా చెప్పగలవో అలాగే!”

“ఓ హృదయనాధుడమైన నా తెలివి తక్కువ భర్తా!”

మూర్తి పకపక నవ్వి తన భార్యను గట్టిగా హృదయానికి అదుముకొని, ఆమె పెదపులు తమిగా ముద్దిడుకొని, “ఈ శచీదేవి విగ్రహం అఖండ సౌందర్య పూరితం కావచ్చు కాని నా జెన్నీ సౌందర్యం ముందు -”

2

అజంతాలో మూడు రోజులున్నారు. దీపాలు పెట్టి చూచారు. ఈనాటి డేరాలు, ఈనాటి క్యాంపు కుర్చీలు, బల్లలు, ఆ ఆడవాళ్ళ చేతి సంచీలు, అన్నీ జెన్నీ చూచి ఆశ్చర్యం పొందింది. “ఆనాటి స్త్రీలు ఇప్పటివాళ్ళకన్న అందమైనవాళ్ళు. ఎక్కువ నాగరకత కలవాళ్ళుగా కనబడుతున్నారు ప్రియతమా!” అని ఆమె అన్నది.

“పురుషులూ అలాగే కనబడుతున్నారు. ఈ అజంతా ప్రపంచంలోని ఉత్తములు ఈనాటి ఉత్తములులానే కనబడుతున్నారు. ఈ బోధిసత్వులా బుద్దుడిలా ముఖాల్లో మహాత్ముని ముఖం కనబడటంలేదు నీకు. ఈ శిబిచక్రవర్తే ఈనాటి జవహర్‌లాల్ అయి ఉంటాడు. ఇక్కడ ఎక్కడో వీళ్ళందరిలో వెదికితే నేనూ కనబడతాను సుమా!”

“నేను కనబడను కాబోలు.”

“ఈ అజంతా బాలికలలో సౌందర్యవంతులయిన యువతులలో ప్రథమురాలు నీకన్న కొంచెం తక్కువ.”

అడివి బాపిరాజు రచనలు - 7

85

నరుడు(సాంఘిక నవల)