పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొన్నాను. చదువు చెప్పడానికి నెలకు ముప్పది ఇచ్చి ఒక ఉపాధ్యాయుణ్ణి ఏర్పాటు చేశాను. ఆత్మేశ్వరీ! భగవంతుడూ, ప్రజలూ, కాంగ్రెస్‌వారూ మెట్లు కట్టుకొని నీ ఉత్తమపథం నువ్వు చేరు అని నన్ను పంపించారు. లోకంలోని అభ్యుదయమంతా పురుషునికి అతని స్త్రీ రూపంలో, స్త్రీకి ఆమె పురుషుని రూపంలోనూ ప్రత్యక్షమవుతుంది. నా దివ్యాభ్యుదయ "మూర్తివి నువ్వు!”

“చాలులే! నేను స్త్రీని, నువ్వు పురుషుడవు. నిన్ను నేనూ, నన్ను నువ్వూ కామపరతంత్రులమై వాంఛించుకొన్నాము. ఆ కామవాంఛను సాంఘిక సమదర్శనంకోసం, శాంతికోసం కాలువ త్రవ్వి ప్రవహింప చేయవలసి వచ్చింది. ఆ కాలువ వివాహం. అందుకని మనం ఇద్దరం వివాహమాడినాము.”

“అయితే యవ్వనం నశించిన తర్వాతకూడా మానవులకు ప్రేమలు ఎందుకుంటాయి?”

“అవి చిరకాల సహవాస జనిత స్నేహాలు.”

“భార్యాభర్తలకన్న పురుషులకూ, స్త్రీలకూ ఎక్కువ స్నేహితులుంటారు. అయినా ఆ స్నేహితులకు కూడా భార్యాభర్తలకున్న ఉత్తమ స్థితి రాదేమి?”

“చిరకాల కామస్నేహం అది. అది విచిత్రమైనది కాబట్టి మామూలు స్నేహంకన్న కామస్నేహం గొప్పది.”

“కామమే ప్రేమలో ముఖ్యభావం అయితే, ఒక స్త్రీ ఏ పురుషునిపడితే ఆ పురుషునిగాని, ఒక పురుషుడు ఏ స్త్రీని గాని కామ సంబంధంకోసం ఏరుకోక ప్రేమ అని అంటారేం?"

“వెర్రివాళ్ళు కనుక!”

“ఆ వెర్రే ప్రేమ గనుకా అను”

“ప్రేమ వెర్రితనం ప్రేమ అంటావు!”

“కాదు, ప్రేమికుడు వెర్రివాడు అంటారు ప్రియతమా?”

జెన్నీ లేచి భర్త మెడచుట్టూ చేయివైచి, “ప్రేమ అనే దివ్యగుణం లోకంలో ఉందని నాకు తెలియును ప్రియతమా! నీతో వాదించడం ఎంతో ఆనందం!”

5

యుద్దం సాగిపోతూ వుంది. 1940 సంవత్సరం మార్చి నెల వచ్చింది. ఆ సమయంలో మూర్తి కట్టిన ఒక పక్క సిమెంటు గట్టుతో కూడిన కొండచరియ క్రింద లోయలోనికి జారిపోయింది. ఆ జారిపోవడంవల్ల మూర్తి హృదయమూ జారిపోయింది. దానివల్ల జలాశయానికి ఇరువది రెండు చదరపు అడుగులు పోయాయి. ప్రభుత్వానికి రెండు లక్షల రూపాయలు నష్టం వచ్చింది.

దీన్ని గురించి మూడు రోజులు చమటలతో తడిసిపోతూ మూర్తి ప్రభుత్వానికి రిపోర్టు పంపించినాడు. నాలుగో రోజుకు పెద్ద ఇంజనీర్లందరూ అక్కడకు పరుగెత్తుకొని వచ్చినారు. వాళ్ళు నాలుగు దినాలు పూర్తిగా పరీక్షించి ఇందులో మూర్తిలోటు ఏమీ

అడివి బాపిరాజు రచనలు - 7

81

నరుడు(సాంఘిక నవల)