పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలాంటి భోజనాలు ఎన్నిసార్లో తిన్నాడు ఎల్లమంద. చిన్నతనంలో ఇలాంటి శుభకార్యాలు శాస్త్రులుగారి ఇంట ప్రతిరోజూ జరుగుతూ ఉంటే బాగుండిపోను అని అనుకున్నాడు.

గాంధీజీ కాంగ్రెసు నాయకుడై, హరిజనోద్యమం వచ్చినప్పటినుండీ సభలు జరుగుతున్నాయి. అలాంటి హరిజన మహాసభలలో కూడా రెండు రోజులపాటు కాంగ్రెసు నాయకులు వంటలు చేయించి భోజనాలు పెట్టిస్తున్నారు.

ఎంత దుర్గతి తన జాతికి! ఏనాటికి, ఎన్ని వందలు సంవత్సరాలకైనా కడుపు నిండా తినడం తన సంఘానికి రాగలదా అని అనుకుంటూ ఎల్లమంద భోజనం ముగించాడు.

3

ఎల్లమందమూర్తి ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఇంజనీరును కలుసుకున్నాడు. ఇంజనీరింగు శాఖా సభ్యుని చూచినాడు. తాను ధరించిన విదేశీ దుస్తులు అతనికి అసహ్యం వేశాయి. కాని అవి ధరించి వెడితేగాని ప్రభుత్వోద్యోగుల్ని చూడడానికి వీలులేదు. హృదయానికి ఆ దుస్తులంటే ఇష్టంలేదు. తన సంఘం అతి నీచం అవడంచేత యీ పెద్దరకం విదేశీ దుస్తులు ధరించాలి. తక్కిన భారతీయులందరితో సమానంగా ధరించాలి. అప్పుడు ఇంకా గొప్పతనం కూడా ఉంది అన్న భావం వస్తుంది కదా..

అలాంటి భావాలన్నీ మహాత్మునితో మనవి చేసుకున్నాడు.

“మూర్తీ వేలకొలది సంవత్సరాలు బాధపడిన మీ జాతి బాధాస్నాతులై మహాపవిత్రత పొందారు. నేను మీకు సేస్తున్నానంటే వట్టి ధర్మపాలనకే కాదు. బాకీ తీర్చడానికీ కాదు. మీ సేవచేసి పవిత్రత పొందడానికి!” అని బాపూజీ దివ్యనేత్రాలు పలికినాయి.

“బాపూజీ! నా కర్తవ్యం నాకు తెలియటంలేదు. ఇంత చదువు చదువుకొని వచ్చి, నేను ప్రభుత్వోద్యోగం స్వీకరించకుండా ఉంటే నా చదువు వృధా! ఈ చదువు మన దేశానికి ప్రస్తుతం శిరోమణి వంటిది. ఆనకట్టలు లేక నదులు ఉపయోగం లేదు. ఆనకట్టలవల్ల విద్యుచ్ఛక్తి ఉద్భవిస్తుంది. ఈ శక్తి దేశానికి వెలుగూ, పొలాలకు నీరూ, గృహాలకు చిన్న పరిశ్రమలకు ఎన్ని విధాలో ఉపయోగం. పూర్వకాలపు గృహ పరిశ్రమలూ, గ్రామ పరిశ్రమలూ, కొద్ది రూపం మారుతాయి. వ్యవసాయమూ, మరీ రాక్షసం కాకుండా అనేక రూపాల ఉత్తమ విధానాలు అలవరచుకొంటుంది.” అని మనవి చేసుకొన్నాడు.

సేవా గ్రామంలో ఉన్నన్నాళ్ళూ వడుకుతూ ఉండే వాడు. వడుకుతూ ఉండవచ్చును. రాతసమయంలో, నడిచేటప్పుడూ ఇతర విధమయిన పని సమయములోనూ తప్ప తక్కినప్పుడు రోజుకు ఒక గంటో రెండు గంటలో ఎందుకు వడకకూడదు. ఆ నిశ్చయానికి వచ్చి ఆ పనే చేయడానికి సంకల్పించుకొన్నాడు.

సేవాగ్రామంలో ఉండే రోజుల్లో చేతిపరిశ్రమగా విద్యుచ్ఛక్తి పిడంబితమయిన వస్తువులు తయారుచేయడం, ఈలా అని దీపాలు వగైరాలు ప్రయత్నించాడు. వెదురుగొట్టంలో బాటరీలు పెట్టడం లోపలనుండి రెండు శక్తులూ కలిసేటట్లు ఏర్పాటు చేయడం దీపం వెలగడం ఈలాంటి చిత్రాలు చేస్తూ ఉండేవాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

51

నరుడు(సాంఘిక నవల)