పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దివ్యక్షణంనాటి పరమ మధుర వర్ణం! జెన్నిఫర్ తండ్రి ఎడ్వర్డు కార్లయిలుగారు బి.యి. పరీక్షలో మొదటి తరగతిలో విజయమంది ఎం. ఎస్. ఎం రైల్వే ఇంజనీయరు అయి, ఇప్పుడు చీఫ్ ఇంజనీయరుగా వున్నారు.

జెన్నిఫర్ - ఎడ్వర్డు కార్లయిలుగారి ముగ్గురి బిడ్డలలో కడసారిది. మొదటి ఇద్దరూ మొగవారు. పెద్దకొడుకు రిచ్చర్డ్ కార్లయిలు బి.యే. కాగానే భారతీయ సైనిక దళ నాయకుడు కావడానికి నిశ్చయించుకొన్నాడు. అందుకై డెహరాడూన్ సైనిక కళాశాలలో చేరి విజయమంది ఇప్పుడు మేజరై పెషావరు శిబిరంలో ఉన్నాడు. అతడు ఉత్తరాది యూరేషియన్ బాలికతో వివాహమై ఇద్దరుబిడ్డల తండ్రి అయినాడు.

రెండవ కొమరుడు ఇరవైయొక్క సంవత్సరాల ఈడున్న రోజులలో మదరాసు లయోలా కాలేజీలో బి.ఏ.లో కృతార్థుడై ఇంగ్లండులో విద్యుత్ ఇంజనీయరు విద్య నేర్చుకోడానికి సంకల్పించారు. అతని పేరు లయెనెల్.

అతడు 1933వ సంవత్సరం మే నెలలో ఇంగ్లండు వెళ్ళే పి అండ్ కో. ఓడ 'రావల్పిండి'లో రెండవ తరగతిలో ప్రయాణం చేసే ఎల్లమందమూర్తిని కలుసుకొన్నాడు. లయొనెలకు, ఎల్లమందకు ఒకరు రాజమహేంద్రవరంలో, ఒకరు మద్రాసులో ఉన్నా మొదటినుంచీ ఎందుకో విద్యుత్ శక్తి అంటే అభిమానం పుట్టి ఇంగ్లండు వెళ్ళి ఇంజనీర్లు అవుదామని వారికి గాఢవాంఛలు గలిగినాయి. వారిద్దరూ కలిసే ఇంగ్లండు చేరినారు. లండనులోనూ ఇద్దరూ కలిసి బస కుదుర్చుకున్నారు.

నారాయణరాజుగారి సహాయంవల్ల హరిజన నిధినుండి మొట్టమొదట వేయి; తర్వాత నెలకు ఏభై రూపాయల వేతనం మూర్తికి వాగ్దానం అయింది. ఆంధ్ర జమీందారులలో ఉత్తములు శ్రీపురం జమీందారులు నెలకు ఏభై చొప్పున ఇచ్చుటకు మూడు ఏండ్లకు అయ్యే పద్దెనిమిది వందల రూపాయలు మూర్తికి యీయ వాగ్దానం చేశారు.

నారాయణరాజుగారి సహాయంవల్ల భీమవరం తాలూకాలోని ధనవంతులయిన క్షత్రియులు, తటవర్తివారు, కోరుకొల్లు కరణంగారు రెండువేల రూపాయలు వసూలుచేసి ఇచ్చినారు. ఈ మూడేళ్ళలో ఇంకొక వేయి రూపాయలు వసూలుచేసి పంపుతామని మాట యిచ్చారు.

అలా చిన్నన్నగారు ఇంగ్లండులో చదివే రోజులలో పద్దెనిమిదేళ్ళ ఈడు బాలిక జెన్నిఫర్ మదరాసు వైద్య కళాశాలలో చేరింది. కార్లయిలు వంశంలో వైద్య విశారదలైన స్త్రీలు ఎంతమందో తరతరాలనుంచి ప్రసిద్ధి పొందారు. వారు నర్సు పని నేర్చుకొని రెడ్‌క్రాసులో పనిచేస్తుండేవారు.

ఈనాడు ప్రసిద్ధవైద్యురాలయి, మదరాసు ఘోషా ఆస్పత్రికి ముఖ్యవైద్యురాలయిన మేనత్త డాక్టరు గ్రేస్ టెంపిట్టనులా ఆమెకు కూడా వైద్యురాలు కా సంకల్పించి జెన్నిఫర్ వైద్యకళాశాలలో చేరింది. డాక్టరు గ్రేస్ వారి భర్త డాక్టరు టెంపిల్టను కలకత్తా యూరోషియనులలో ఉత్తమ కుటుంబీకుడు.

జెన్నిఫర్ వైద్య కళాశాలలో మూడవతరగతి చదువుతూ అందరి బాలికలతో ఆనందంగా మెలుగుతూ, టెన్నిస్ ఆడుతూ, భారతీయ రాజకీయాలను గూర్చి,తన జాతి


అడివి బాపిరాజు రచనలు - 7

21

నరుడు(సాంఘిక నవల)