పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేడియో ప్రసంగాలు : 7

పత్రికలు, సంపాదకత్వం : తెలుగు : అభినవాంధ్ర సాహిత్యం (1915 - రాజమండ్రి), మీజాన్ (1944-1947), హైదరాబాదు; ఇంగ్లీషు : త్రివేణి (మచిలీపట్నం - సబ్ ఎడిటర్)

అనువాద గ్రంథం : “నా పడమటి ప్రయాణం”

సాహిత్య లేఖలు : సుమారు 50

చిత్రకళాకేళి :

చలనచిత్ర "కళాదర్శకత్వం" : సతీ అనసూయ - ధ్రువ విజయం (1935), మీరాబాయి (1940), పల్నాటి యుద్ధం (1944).

జలవర్ణ చిత్రాలు (47), తైలవర్ణ చిత్రాలు (2), రేఖా చిత్రాలు : విశ్వనాథ సత్యనారాయణ - కిన్నెరసాని పాటలు - ముఖచిత్రం : లోపలి చిత్రాలు (4), శృంగార వీథి (1), నండూరి సుబ్బారావు - ఎంకి పాటలు (2), పత్రికలలో కథలకు : నాగరాజు (భారతి - జనవరి 1927), అతిథి దేవుడు (భారతి - మే 1927), హిమాలయరశ్మి (భారతి - జనవరి - 1937), నాగలి (భారతి), భోగీర లోయ (భారతి), తూలికానృత్యం (భారతి), పెన్సిల్ స్కెచ్‌లు : కడలూరు జైలులో ఉన్నప్పుడు వేసినవి, ఫిడేలు నాయుడుగారి కచ్చేరి, రామప్ప గుడిలోని “నాగినీ నృత్యం” చూసి, సాలార్‌జంగ్ మ్యూజియంలోని “నవాబుల హుక్కా” చూసి (ఇంకా చాలా ఉన్నాయని రాధా వసంత గారు తెలియజేస్తున్నారు).

బాపిరాజు రచనలు విషయంగా పిహెచ్.డి., ఎమ్.ఫిల్. వ్యాసాలు

డా|| ధనిరెడ్డి విజయలక్ష్మీదేవి (శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం) 1980, డా|| వి. తిరుపతయ్య (ఉస్మానియా విశ్వవిద్యాలయం) 1982, డా|| మన్నవ సత్యనారాయణ (నాగార్జున విశ్వవిద్యాలయం) 1984, డా|| వి. సిమ్మన్న (ఆంధ్ర యూనివర్సిటీ) 1985, శ్రీ శెట్టి వెంకట నారాయణ (కాకతీయ విశ్వవిద్యాలయం) 1987, శ్రీమతి వి. వనజ (కాకతీయ విశ్వవిద్యాలయం) 1984, శ్రీమతి రమారాణి (కాకతీయ విశ్వవిద్యాలయం) 1986.

బాపిరాజు సంస్మరణ సంచికలు

1. కులపతి (1954) : సంపాదకత్వం - శ్రీ రావులపర్తి భద్రిరాజు, 2. చుక్కాని (1962) : సంపాదకత్వం - శ్రీ కంచి వాసుదేవరావు, 3. నాదబిందు శశికళ (1985) సంపాదకత్వం - డా|| దిట్టకవి శ్యామలాదేవి, 4. అడివి బాపిరాజు - శతవార్షిక కళాసాహిత్య ప్రత్యేక సంచిక (1995), సంపాదకత్వం - భ.రా.గో.

★ ★ ★

180