పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవ బాలికలు, తెలుగు బాలికలు మాతో ఎంతో ఆప్యాయంగా కలిసి ఉంటున్నారు. అందరమూ భారతీయాంగనలము అన్నమాట ప్రతి అక్షరమూ నిజం” అన్నది.

“పాడండి” అని రెండవ అరవ అమ్మాయి కోరింది. రైలు వేగంగా బిట్రగుంట దాటి వెళ్తోంది.

పద్మావతి రైలు హోరున శ్రుతికలిపి తోడిరాగము ఆలాపన ప్రారంభించింది. ఆ రాగం అరగంట పాడింది. తరువాత తానం ఎత్తుకుంది. తానం ఇరవై నిమిషాలు సాగింది. ఆ వెనుక పల్లవి ప్రారంభించింది.

వంగోలు దాటిపోయింది.

పల్లవి ఒక అరగంట సాగింది.

స్టేషన్లు వెళ్ళిపోతున్నాయి.

రైలు మహావేగంతో సాగిపోతూంది.


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

169

జాజిమల్లి(సాంఘిక నవల)