పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“అయినా మంచివాడు. ఎంత చాకిరీ చేశాడు! ఎంత నమ్మకం. తనకూ పద్దాలుకు తల్లీదండ్రి అయ్యాడు. ఎంత ఓపిక, ఎంత నెమ్మది, ఎంత ఆపేక్ష! సరే ఎక్కడకు వెడతాడు? నాలుగు రోజులు కాగానే వస్తాడు. ఈలోగా తిరిగిరానీ!"

ఆ మర్నాడు బుచ్చి వెంకట్రావు చూసుకున్న ఉత్తరం పద్మావతికి వచ్చింది. ఏమిటీ ఉత్తరం అనుకుంటూ, పద్మ కవరు విప్పి చదవనారంభించింది.

ఉత్తరం సాగినకొద్దీ ఆమె గుండె దడదడ ఎక్కువ కాసాగింది. ఉత్తరం పూర్తిచేసి కాళ్ళు తేలిపోగా, పద్మావతి మంచంమీద కూలబడింది. ఏమిటి మేష్టారే! తమ్ము విడిచి వెళ్ళిపోవటమా? ఇంకేముంది! ఇంక తనకు సముద్రమే దిక్కు

ఆమెకేదో భయం పట్టుకుంది. తాను తన భర్త దగ్గరకు వెళ్ళడానికి భయం వేసింది. వెళ్ళి “ఏమిటి?” అని నరసింహమూర్తి మేష్టారును గురించి అడగాలని. కాని ఏమి అడుగుతుంది! ఆయన చాలా దూరమైపోయాడు.

తమను గురించి ఆయన అల్లా రాసినాడేమిటి? ఏమిటి? అలా వెళ్ళిపోయినా డేమిటి? తనగతి ఏమిటి?

ఆమెకు కళ్ళు తిరిగిపోయినాయి.

★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

143

జాజిమల్లి(సాంఘిక నవల)