పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఈ విషయాలన్నీ ఆలోచించడానికి నాకు శక్తి ఎక్కడ ఉందండి!”

“కాబట్టి ఏమీ ఆలోచించకుండా ఉండరాదా అండి.”

“అది ఎల్లా సాధ్యం! నేను యోగినా? ఉప్పూ, పులుసూ, కారం తినేవాడిని.”

“అయితే ఆ ఆలోచనలవల్ల వచ్చే బాధలను, ఆవేదనలను భరించడం నేర్చుకోవలసిదా, ఉంటుంది. అసంతృప్తి వల్ల వచ్చే హృదయ బాధ భరించవలసిదా ఉన్నది.”

“అందుకోసమే సర్వకాలమూ ప్రయత్నం చేస్తున్నాను!”

ఇంతట్లో నాయరు ఏవేవో ఫలహారాలు, “టీ కెటిల్” పాల “జగ్గూ", పంచదారభరిణా, చెంచాలూ, అన్నీ పట్టుకు వచ్చి, ఆ లోని హాలులో ఒక మూలగా ఉన్న టీ బల్లపైన వుంచాడు. సుశీల “రండి మీ వెంకట్రావుగారూ!” అని పిలిచి అతణ్ణి టీ బల్ల కడనున్న కుర్చీలో ఒకదానిలో కూచోమని కోరింది. వారిద్దరూ కూచుని ఉపహారం సేవింప సాగించారు.

“ఏమండీ వెంకట్రావుగారూ! మీకు తోచనప్పుడల్లా మా ఇంటికి రండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడే రావచ్చును. అరవ సినిమా చిత్రాలలో, మళయాళ చిత్రాలలో, నా కంఠము కొందరు సినిమా తారలకు ఇస్తున్నాను. అందుకై పాటలు రికార్డింగుకు మాత్రందా వెడుతూ ఉంటాను. నాట్యకత్తెగా సినిమా చిత్రాలలో నటిస్తాను. గనుక, ఆ సమయాలలో తీరుబడి ఉండదు. మీరు ముందు ఫోనుచేసి, మా ఇద్దరిలో ఎవరన్నా ఉన్నారో లేరో కనుక్కుని, ఎవరున్నా తప్పకుండా రండిమీ. మీ ఆవిణ్ణిదా తీసుకువస్తూ ఉండండి”

“మా ఆవిడ ఆంధ్ర మహిళాసభ విద్యాలయంలో విద్యార్థిని. ఆవిడ ఆసభ విద్యాలయం, వసతి గృహాల క్రమశిక్షణకు బద్దురాలు కదా! కాబట్టి ఎప్పుడు ఆవిణ్ణి వీలుగా తీసుకురావచ్చునో అప్పుడల్లా తీసుకువస్తాను.”

“మీ రెప్పుడు ఇంటి దగ్గిరనా ఉందురు?”

3

“ఇల్లూ, ఆఫీసూ ఒక్కటేగనుక ఎప్పుడుపడితే అప్పుడే వుంటాను.”

“అయితే చూస్తిరా? నేనుగాని, నేనూ మా ఆయనగాని, మా ఆయన ఒక్కరేగాని మీ ఇంటికి తరుచుగా వస్తూ వుంటుమే.”

“అంతకన్న భాగ్యమేముందండీ!”

అంతకంతకు బుచ్చి వెంకట్రావుకు సుశీలతోనూ, రాధాకృష్ణతోనూ స్నేహం ఎక్కువయినది. ఈతడు వీరింటికి రావడమూ, వీరు బుచ్చి వెంకట్రావు ఇంటికి వెళ్ళడమూ, అందరూ కలిసి సినీమాకు వెళ్ళడమూ, వెంకట్రావుకు కాలం జరగడం లేదన్న ఆవేదన పోయింది.

అతనికి, సుశీలకూ స్నేహం ఎక్కువైంది. సుశీల అతణ్ణి ఒక్కణ్ణే కలుసుకునేది. అతణ్ణి కారుమీద ఈ ఊరు ఆ ఊరు ప్రయాణం చేయించేది. రాధాకృష్ణ “సుశీల మీ చెల్లెలనుకోండి, మీ రామెస్నేహంలో ప్రపంచజ్ఞానం పూర్తిగా అలవలరచుకొంటారు బావగారూ!” అనేవాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

133

జాజిమల్లి(సాంఘిక నవల)