పుట:Jagattu-Jiivamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలాకాశవైచిత్రి

53

సామ్రాజ్యాధీశుడయ్యు ముహూర్తమాత్ర భోగలాలసతకు దాసు డై నారీమణివలె సాలంకృతుడై పూవుబోండ్లను హెచ్చరిస్తున్న పురుష సింహమగు అక్బరును ఆ విజ్ఞాని చూస్తున్నాడు; చూచి, అపరిమితానందానుభూతిలో నున్నాడు.

ఆ నౌరోజాలో పాల్గొన్న మహిళలు, మొగలుసామ్రాట్టు గతించి 3 శతాబ్దాలు గడిచేయి. ఆ నారీగణంలో మచ్చున కొక్క వ్యక్తికూడ నేడులేదు. చరిత్రస్థమైయున్న విఖ్యాత స్త్రీ నామముల కన్న ఇతరుల నామములే మనకు తెలియవు. కాని, ఆంటారిస్‌లోని విజ్ఞాని ఆ నారీమణుల నందరనుచూచి ఆనందిస్తున్నాడు. ఆవిజ్ఞాని కాదృశ్యం వర్తమానంలో సంభవిస్తూంది. మనకు ఆ దృశ్యం భూతకాలంలో జరిగిపోయింది. అందు పాల్గొన్న వ్యక్తులు లయమయి పోయి వందలకొలది ఏండ్లు గతించేయి. మనకు భూతకాలమైనది మరొకరికి వర్తమానమౌతూంది. అయినచో భూతభవిష్యద్వర్తమానము లన్నప్పుడు ఎవరి దృక్పథంలో వాటిని నిర్వచించడం ? కాలవిభాగం గురించి నిర్ణయించడానికి మనకున్నంత హక్కు ఆంటారిస్ లోకవాసికి మాత్రం లేదా ?

ఇంకొకవిశేషము : ఆంటారిస్ విజ్ఞాని సూక్ష్మోపకరణ సహాయంతో కొన్నిసంవత్సరాల దూరంలోనున్న మరొక నక్షత్రవాసితో సంప్రతింపగల సామర్థ్యం సంపాదించేడనుకొందము. ఆ నక్షత్రవాసి విశేష సంస్కృతిగలవాడౌటచేత తనకు మరికొన్ని కాంతివత్సరాల దూరంలో నున్న మరొక లోకవిజ్ఞానికి సందేశమంపగలడని, ఇట్లు భూలోక దృశ్యవార్త నక్షత్రంనుండి నక్షత్రానికి వ్యాపింపబడుతూందని అనుకొందము. మహా మేధానిధులైన అన్యలోకవాసులు నియత