Jump to content

పుట:Jagattu-Jiivamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవితాంతము

39

భూలోకవాస మంతగా వాంఛనీయం కానప్పటికి, నేటి మహోన్నతాశయములే మన భావి పరిణామానికి ఆధారభూతం కావచ్చును. మన మహోత్కృష్టభావములే మరణ పురోగాములై పరలోకమందు మనకు స్వాగతమొసంగ సిద్ధమై యుండవచ్చును. ఆ భావముల నావరించి స్ఫటికీకరించు అనంతము మన స్వభావాను కూలంగా ఉండవచ్చును. పరలోకంజేరి అచ్చట మన జీవితాన్ని సంస్కరించు శక్తి ఎట్టిదైనను మానవశక్తికన్న ఉత్తమోత్తమమై, ఆనందదాయకమగునది కాకతప్పదు.

మనస్సునకొక్కటే దుఃఖము : ఆత్మజ్ఞానము పొందలేదని, అందుకు సామర్థ్యమైనా లేదని. శరీరంనుండి వియోగింపబడిన మనస్సునకు భూలోక దుఃఖస్మరణచే విచారం కలుగవచ్చును. కాని, ఆత్మజ్ఞానం పొందలేని అసామర్థ్యానికి జనించు దుఃఖంముందు ఈ విచారం క్షణికము, క్షుద్రము.

ఆత్మజ్ఞానానుభూతి నాశింపవచ్చునా అంటే జగత్తులో ఆత్మ జ్ఞానం లేనివస్తువుండుట కష్టము. ఏమనగా జగత్తే జ్ఞానము, జ్ఞేయము.

ఆనంత్యంలోనున్న మనస్సు స్వపరిమితని గుర్తింపజాలదు ; గుర్తించినను దాని నతిక్రమిస్తుంది. కాబట్టి పరిమితజ్ఞానజనిత దుఃఖానుభవం లేదు. అగుట, ఆత్మజ్ఞానానుభూతి నొందజాలని పరితాపానికి అవకాశం లేదు. ఆనంత్యంలో సమ్మిళితమైనంత అమందానందప్రా ప్తియే కదా !

ఆనంత్య స్వభావమెట్టిది ? ఆనంత్యం రెండువిధాలుగా గోచరిస్తున్నది. ఒకటి బుద్ధిగోచరమౌచున్నది. రెండవది ఇంద్రియ