జీవితాంతము
37
లేకపోలేదు. ఎట్టి చైతన్యరహితమైన అవస్థానమని ప్రశ్నిస్తే, జీవ సంబంధ చై తన్యరహితమైనది అంటారు. జీవసంబంధ చై తన్యం అనంత్యంలో నుండుట కవకాశం లేదని తొలుతనే కనుగొన్నాము. అయితే, విశ్వచై తన్యమే లేదంటారు. అది అయుక్తము. కావున, చై తన్య రహితమైన అవస్థాన విషయమై ఇట్లు పురస్కృతమైన వాదము మిథ్యావాదము. మానవధృతిని అలజడిపెట్టు మహత్తరమైన క్లిష్టసమస్యలకు సూక్ష్మంగా ఒకలిప్తలో సమాధాన మొసగుట కేర్పడిన వితండవాదము.
ఈ సమస్య మానవజిజ్ఞాసకన్న మగోన్నతమైనది; మానవ సాహసప్రవృత్తికి అనుగుణ్యమైనది. దీనిని సాధింఞాచుటెట్లు ?
మన కజ్ఞేయమైన ఒకజీవితంగా మృత్యువుని భావించు కొందము. మరణాన్ని సైతం జననంవలె వీక్షించు సమదృష్టి నలవడ చేసికొందము. అట్టితరి, శిశుజననవార్త నాలకించుటకు కడగు కుతూహలంతో మరణ వార్తనుసైత మాలించ కలుగు మనస్థితి ఏర్పడగలదు. జరామరణరహితమై, శాంతయుతమైన నిర్జన్మము, మరణంతో పూర్తిగాని మాయామేయ చరిత్రగల భౌతికజన్మము అను ద్వివిధజన్మములు కలవని భౌతికజన్మకు పూర్వమే మన కెరిగించి, వాటిలో వాంఛనీయమైన దానిని పొందుటకు అవకాశమిచ్చి యున్నచో, భౌతికజీవితాన్ని ఎవరభిలషిస్తారు ? సత్య జ్ఞానాభ్యున్నతిని నిరోధించు ఈక్షుద్రప్రపంచంలో కాలిడుటకు ఎవరంగీకరిస్తారు ? కాగా, భూలోకావాసము నుత్తరించు మరణము నాయిత్తపెట్టు అంత్యకాలమే జీవితంలో శ్రేష్ఠతమమైన భాగము. మరణద్వారం తెఱవబడగానే నిరామయానంత్య విహారార్ధియై జీవాత్మ ఉద్గమిస్తుంది, ఆనందసాగరంలో ఓలలాడుతుంది.
ఈ సాగరంలో "అహం" గతి యేమి ?