34
జగత్తు - జీవము
"అహం" యొక్క వినాశంగూర్చి యోచించు సందర్బంలో ఈ "అహం" మన మనస్సుకాదని, శరీరం కాదని విశదమౌతుంది. "అహం" రూపంగాదు, పదార్థంగాదు - రూపపదార్థాలు నిత్య పరిణామ మొందునవి. "అహం" జీవంగాదు, ఏమనగా రూపపదార్థాలకు కారణమో కార్యమో అయియుండాలి జీవము. అయితే, అదొక బిందువా ? అది అనిర్వచనీయము. అదొక ధారణపరంపర. భావశ్రేణి ; బాహ్యశక్తులతో ప్రవృత్తించు నిత్యక్రియల సముదాయము.
సంశయగ్రస్తమై, ఊహాతీతమై, క్షణభంగురమైన "అహం" ఒక ఆభాసము. ఈఆభాసవ్యామోహితులమై జీవితసత్యాన్ని పరిగణించము. అనంతకాలాకాశంలో మన శరీరమందలి ద్రవ్యం అత్యద్బుత పరిణామమునకు లో నౌతుంది. భౌతికశరీరం విచ్ఛిన్నంకాగానే, అందులోని పరమాణువులు కొన్ని భూమిని విడిచిపోవచ్చును ; అట్టివాటిలో గొన్ని, భూమినాశ్రయించినవాటిలో గొన్ని, కాలానుసారంగా ఏపరిమళ కుసుమంగానో, సుగంధంగానో, కాంతిగానో, వాయువు గానో, నక్షత్రంగానో పరివర్తనమొంది అనంత సౌభ్యానుభూతి నొందవచ్చును. కాని, ఆవిషయాన్ని ఉదాసీనభావంతో త్రోసి పుచ్చెదము : జగజ్జీవంతో మేళగించువరకు మనధృతి వికసించి, దాని నవగాహన చేసికొని దానిని శాసించగలదన్న భావంకూడ మనకు తృప్తికరం కానేరదు ! అట్టి మహత్తర విషయాలను యోచింపనీయక, ఆదివ్య పరిణామానుభవం మనకు కాజాలదని, అయినప్పటికి సుఖప్రదంకాదని "అహం" భ్రమింపచేస్తుంది.
"అహం" అంతటితో తృప్తినొందదు. "నా మనస్సులోని మహోన్నతభాగాలు, స్వాంతంత్ర్యభాగాలు, చారుతరభాగాలు నిరంతర