పుట:Jagattu-Jiivamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

జగత్తు - జీవము

ఇక పరలోకావాసత్రాస మొక్కటే మిగులునది. పరలోక యాతనలగూర్చిన మతాభిప్రాయముల విడిచిపెట్టుటే శ్రేయస్కరము. బుద్ధిగోచరమగునట్లు నప్రమాణంగా పరలోక బీభత్సాలను నిరూపించిన మతంలేదు. మానవు డానిరూపణములను విశ్వసించి సహజ సత్యాన్వేషణనుండి విరమించుటకు, అవి అప్రతిహతములై యుండవలెను. సర్వేసర్వత్ర సత్యాన్వేషణమందు నియోగింపబడుటకే చిచ్ఛక్తిమనకు దత్తమైనది. సరళమైన తర్కంచేత విషయ నిర్ణయం చేయవలసిన అగత్యము ప్రతివిషయమందున్నది. సదాచారానికి తర్కాన్ని త్యాగం చేయమనుట ధర్మమా ? బుద్ధినిమించిన అత్యుత్తమశక్తి దైవదత్తమై మనలో గుప్తంగా నుండగా, మన ధీ శక్తినే అనివార్యంగా ఆకర్షించలేని కొన్ని విశ్వాసములను మూఢబుద్ధితో అనుకరించలేదని దైవం శిక్షిస్తే మనమేమి చేయగలము ? తను ప్రసాదించిన పరాత్పరాంశమగు జ్ఞానజ్యోతిని నిరసించి, తిరస్కరించు విషయాల నంగీకరించలేదని దైవం మందలిస్తే, మనమేమిచేయగలము ? దుర్‌జ్ఞేయమగు క్రూరచిద్విలాసానికి, ఘోరతర తంత్రానికి, దౌర్జన్యానికి బలి గావింపబడితిమని విచారించుటకన్న చేయునదేమున్నది ?

మృత్యు వంధకార బంధురము, ఆ అంధకారంలో విజ్ఞాన రశ్ములు వ్యాపించి, మృత్యు స్వరూపాన్ని విశదపరచువరకు, జీవాత్మ పర్యటింపనున్న పరలోకం భయావహమా, కాదా అను విషయం తర్కించవలసినదే.

మరణానంతరము జీవాత్మ కెట్టిగతి ప్రాప్తించును ? మత దృష్టి వినా జీవాత్మ చతుర్విద అవస్థానముల (four kinds of survival) లో ఏదో యొకటి పొందుట కవకాశమున్నదని భౌతిక