పుట:Jagattu-Jiivamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

జగత్తు - జీవము

తగ్గలేదు. జీవితంలోని క్రూరాతిక్రూర దుర్భరావేదనలు సైతము జీవాంతమున వేచియున్న అజ్ఞాతయాతనలకన్న సాధువులని నమ్మి, వైద్యులు దీక్షతో రోగులకు ఘటికాప్రయోగం చేస్తున్నారు. దుర్భరావేదనాయుత అవసానకాలాన్ని పొడిగించు ప్రతిక్షణము పరలోకంలో జీవికై వేచియున్న దురంత దుఃఖానుభవంనుండి అపహరింపబడినట్లే భావింతురు. ఐహిక అంత్యదుఃఖము, మరణానంతర అజ్ఞాతదుఃఖము : ఈ రెండిటిలో మాయామేయమగు కాల్పనిక దుఃఖాన్ని పరిహరించుటకు యథార్థమైనదానిని అనుభంచుట కంగీకరిస్తారు. దీనివలన రెండు అనర్థములు : అవసానయాతన పొడగించుటచేత మృత్యుసంత్రాసం సహస్రాధికమౌచున్నది, ఆసన్న మృత్యుభయంచేత అంత్యావేదన పొడగించుటకు ప్రబలప్రయత్నం జరుగుచున్నది.

అయితే, ఆరోగ్యం చెడగానే జీవులు మృత్యువువాత పడతారని ఎట్లు నిశ్చయించడం ? బాధోపశమనానికి ఎట్లు చికిత్స చేయ కుండడం అని వైద్యులు ప్రశ్నింపవచ్చును ; అమితావేదనలపాలైన జీవిని జీవితాంతంవరకు కాపాడకుండినచో, చంపినట్లేకదా అన వచ్చును.

యాతనారోపితమైన మృత్యువు మహాబీభత్సంగా గోచరించుటచేత అంత్యదుఃఖాన్ని పొడగించుటే ధర్మమనిపిస్తున్నది. కాని, ఈ యాతన మృత్యుసంబంధమైనదికాదని గుర్తించవలెను. మహా త్రాసజనకమైనది జీవనిర్గమనంగాని, మృత్వ్యాగమనంకాదని తెలిసికొనవలెనేమో ! మృత్యువుని ముష్కరంగా జీవంనిరోధిస్తుంది కాని, జీవంపై మృత్యువు దండెత్తదు. సుషుప్తి కేవలవాంఛనీయము, ఆరోగ్యప్రదము. సుఖనిద్రను మూర్ఖించి త్రోసిపుచ్చినప్పుడు