Jump to content

పుట:Jagattu-Jiivamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవితాంతము

29

మృత్యు వనినంతనే సహజంగా జనించు భయోత్పాతమును విడిచిపుచ్చి, మృత్యువు నొక సామాన్యజీవితధర్మంగా పరిగణించుదము. మృత్యువునకు సంబంధించనివైనను మృత్యువునకారోపింప బడిన లక్షణాలను పరిచ్చేదించగా, ప్రధానంగా తెగిపోయేది అంత్య రోగంలోని దుర్బరావేదన. రోగములు మృత్యువుయొక్క లక్షణాలు కావు ; అవి జీవంయొక్క వికారములు. రోగాన్మాదులెట్టి బాధా పీడితులైనను, ఆరోగ్యోదయమైనంతనే బాములన్నీ మరచిపోతారు. ఆ రోగమేమృత్యువుతో సమాప్తమైనప్పుడు రోగవికారాలను మృత్యువున కంటగట్టి, దుఃఖాశ్రువులతో మృత్యువుకి నిందాభిషేకంచేస్తారు.

మృత్యుముఖంలో మానవు లణుభవించు అంత్యావేదన మానవకల్పితమేగాని, మృత్యుసంబంధమైనదికాదు. మృత్యువుకన్న అంత్యక్షణముల విపరీతయాతనే భయావహము. జీవనజ్యోతి నేకాకి నొనర్చి, నిరాధార నిరంజనమొనర్చి అచింత్యమైన అగాధములలోనికి తృటిలో విసరిపుచ్చు క్షణానికై నిస్సహాయంగా గంటలతరబడి వేచియుండుటే మహాదారుణము.

మృత్యుకోరల జిక్కినవానికి తాననువిభవించుచుండిన వ్యథల జ్ఞానంకన్న వేరుజ్ఞానముండదు. వైద్యసాహాయ్యంతో ఆ వ్యథను దీర్ఘీకరించడమే నేటిసంఘధర్మము. ఎట్టి తీవ్రసంక్షోభజనిత దురంత వ్యధలనై నను సాధ్యమైనంతవరకు పొడగించుటే ప్రధానధర్మమని వైద్యులు తలచెదరు. అహింస పరమధర్మమైనప్పటికి, దారుణక్లేశ యుతమైన అంత్యకాలాన్ని త్వరగా పరిష్కరించరు. ఈపక్షపాతం అసభ్యమని ముందొకప్పుడు తెలిసికొందురు.

మృత్యుభయాన్ని మతం ప్రవేశపెట్టినది. ఆభయం వేళ్లు తన్నినది. మతంపై విశ్వాసం క్షీణిస్తున్నప్పటికి మృత్యుభయం